Friday, March 29, 2024
HomeTrending Newsపెగాసస్ పై విచారణ : అంబటి డిమాండ్

పెగాసస్ పై విచారణ : అంబటి డిమాండ్

Probe into Pegasus: పెగాసస్ అంశంపై తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతోందని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున కొనలేదని గౌతమ్ సావాంగ్ చెప్పారంటూ టిడిపి నేతలు చెబుతున్నారని, కానీ ఆ పార్టీ ప్రైవేటుగా కొని ఉండొచ్చని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు.

మమతా బెనర్జీకి సమాధానం చెబుతారా? లేకపోతే ఆమె మీద పరువు నష్టం దావా వేస్తారా అని ప్రశ్నించారు. సాక్షిలో తన తిండిపై ఏదో వార్త వచ్చిందని కోర్టులో దావా వేసిన లోకేష్ ఇప్పుడు ఏం చేస్తారని నిలదీశారు.  ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్  చీఫ్ గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తే కోర్టు కూడా ఈ కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పిన విషయాన్ని రాంబాబు గుర్తు చేశారు.

సావాంగ్ చెప్పారు కాబట్టి తాము ఏమీ కొనలేదని టిడిపి నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, బాబు మొదటినుంచీ అన్నీ అనైతిక మార్గాల ద్వారానే రాజకీయాలు నడిపారని, గత ప్రభుత్వ హయంలో తమ పార్టీని చిన్నాభిన్నం చేయడానికి ఎన్నో అక్రమాలకూ పాల్పడ్డారని, జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని  రాజకీయంగా సర్వ నాశనం చేయడానికి ఎన్నో మార్గాలు అన్వేషించారని, 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారని వారిలో నలుగురికి మంత్రి పదవులు కూఒడా ఇచ్చారన్నారు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఎన్నోసార్లు తాము  చెప్పామని అంబటి వివరించారు.

తాము నిజంగా అలాంటి పనులు చేస్తే జగన్ అధికారంలోకి వచ్చారా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను అంబటి ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని దుర్మార్గపు పనులు చేస్తే ఓడిపోయారో మీకు తెలియదా అని అంబటి లోకేష్ కు సూటి ప్రశ్న వేశారు.  చంద్రబాబు హయాంలో పెగాసస్ వాడి రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు చేసిన ప్రయతాలపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అంబటి డిమాండ్ చేశారు. అప్పుడే అసలు నిజాలు బైతపడతాయన్నారు.

Also Read : ఆ వ్యాఖ్యలు నిరాధారం: లోకేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్