Wednesday, March 11, 2026
HomeTrending Newsసిఎం జగన్ ను కలుసుకున్న అంబటి రాయుడు

సిఎం జగన్ ను కలుసుకున్న అంబటి రాయుడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 టైటిల్ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, ఆ జట్టు క్రికెటర్‌ అంబటి రాయుడు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుసుకున్నారు.  సీఎస్‌కే టీంను ముఖ్యమంత్రి అభినందించారు. ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు  సిఎంకు అంబటి రాయుడు  తెలియజేశాడు.  అంబటి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

ఇటీవల గెలుచుకున్న ఐపీఎల్‌ ట్రోఫీ ముఖ్యమంత్రికి చూపిన సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్, అంబటి రాయుడు చూపించారు.  సీఎస్‌కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి బహుకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular