Kharif Release: ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం నేడు (జూన్ 1న) గోదావరి డెల్టాకు సాగు నీరు విడుదల చేసింది.  తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం స్లూయిజ్ వద్ద తొలుత  గోదావరి నదికి పూజలు నిర్వహించి అనంతరం  సాగు నీరు విడుదల చేశారు.  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్విచ్ ఆన్ చేసి నీటిని డెల్టా కాల్వలకు నీరు వదిలారు.  రాష్ట్ర హోం శాఖ  మంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, మాజీ మంత్రి రంగనాథ రాజు, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కలెక్టర్ మాధవిలత, రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి,  స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5.29 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది.

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ రాంబాబు డయాఫ్రంవాల్‌ కొట్టుకు పోవడానికి చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని పునరుద్ఘాటించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్‌ నిర్మించారని అందుకే వరదల కారణంగా డయాఫ్రంవాల్‌ దెబ్బతిందని చెప్పారు. డయాఫ్రం వాల్‌ కు మరమ్మతులు చేయాలా లేక పునర్నిర్మించాలా అన్న దానిపై సాగునీటి నిపుణులు , మేధావులు ఆలోచిస్తున్నారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *