Wednesday, June 17, 2026
HomeTrending NewsDr. BR Ambedkar: జూలై నాటికి స్మృతి వనం పూర్తి: మంత్రి సురేష్

Dr. BR Ambedkar: జూలై నాటికి స్మృతి వనం పూర్తి: మంత్రి సురేష్

విజయవాడ స్వరాజ్ మైదాన్ లో డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం పనులు జూలై  నాటికి పూర్తవుతాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సెల్ఫ్ సస్టైన్ మోడల్ లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని, పర్యాటకులకు ఏర్పాట్లు, అంబేద్కర్ లిటరేచర్, అయన జీవిత చరిత్ర తెలిపే విధంగా మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్ కూడా ఇక్కడ ఉంటాయని తెలిపారు. మంత్రులు సురేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు నేడు అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాట్లను పరిశీలించారు.

మేరుగ నాగార్జున మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఓ గొప్ప విగ్రహంగా ఇది ఉంటుందని, 125 అడుగుల విగ్రహం, 80 అడుగుల పెడెస్ట్రియల్ ఉంటాయని, భవిష్యత్తులో ఇదో ఓ గొప్ప చారిత్రిక, పర్యాటక కేంద్రంగా బాసిల్లుతుందని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన సిఎం జగన్ కు ధన్యావాదాలు తెలియజేశారు.

అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular