Saturday, January 18, 2025
HomeTrending NewsH-1B: హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు శుభవార్త

H-1B: హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు శుభవార్త

కెనడా ఇటీవల చేసిన ప్రకటనతో అమెరికా అప్రమత్తం అయింది. హెచ్‌-1బీ వీసాదారులు కెనడాలో ఉద్యోగాలు చేసుకోవచ్చని ప్రకటించింది. ప్రకటన వచ్చిన కొద్ది సమయంలోనే మంచి స్పందన వచ్చింది. దీంతో కెనడా తన ప్రకటన ఉపసంహరించుకుంది. ఈ వ్యవహారమంతా గమనించిన అమెరికా విదేశాంగ శాఖ అధికారులు వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. కెనడా తరహాలో ఏదైనా యూరోప్ దేశం ఇదే పద్ధతి అవలంభిస్తే అమెరికా నిపుణుల సమస్య ఎదుర్కుంటుందని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు అమెరికా శుభవార్త చెప్పింది. అతి త్వరలోనే రెండో విడుత లాటరీ ప్రక్రియను చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీసాలను జారీ చేస్తామని తెలిపింది.

2024 కోటాను భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అమెరికా నిర్ణయంతో భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఆ దేశంలో ఐటీ, ఇతర కంపెనీల్లో పనిచేయాలనుకుంటున్న వారికి లబ్ధి చేకూరనున్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్