America Must Cooperate With The Afghans :
అమెరికా ఒంటెత్తు పోకడలతో ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు దిగజారుతున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ బ్యాంకు ఖాతాలు స్తంభింప చేయటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, వ్యాపారాలు దిబ్బతిన్నాయని అన్నారు. ఆఫ్ఘన్లో మానవుడు(అమెరికా) సృష్టించిన సంక్షోభం లక్షల మందిని ప్రాభావితం చేస్తోందన్నారు. ఇస్లామాబాద్ లో జరిగిన ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ అమెరికా తీరుపై ధ్వజమెత్తారు. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేందుకు ప్రపంచ దేశాలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా మానవతా దృక్పథంతో స్తంభింప చేసిన ఆఫ్ఘన్ ఖాతాలని, ఆ దేశ ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ కోరారు.
మరోవైపు కాబుల్ లో నిరసనలు హోరెత్తాయి. నగదు నిల్వలు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని కాబుల్ లో వేల మంది ప్రజలు ఆందోళనకు దిగారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం ఎండమావిగా మారాయని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ బ్యాంకు నిధులను అమెరికా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాలిబన్లతో సంబంధం లేకుండా ఆఫ్ఘన్ ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఆఫ్ఘన్ ప్రజలు ఆర్థికంగా పరిపుష్టి అయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటామని బ్లింకెన్ తెలిపారు.
Also Read : పాకిస్తాన్‌లో ద్రవ్యోల్భణం