Friday, November 22, 2024
HomeTrending Newsపర్యాటకులకు అమెరికా అనుమతి

పర్యాటకులకు అమెరికా అనుమతి

కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలిస్తోంది. ఇటీవల వాయుమార్గాన్ని తెరిచిన అగ్రరాజ్యం.. దాదాపు 19నెలల తర్వాత సరిహద్దులను తెరవనుంది. ఇప్పటివరకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణికులను అనుమతించని అమెరికా.. ఇకపై ఎలాంటి కారణాలు లేకపోయినా అనుమతించనుంది. ఈ మేరకు నూతన నిబంధనలు ప్రకటించింది.

కొత్త నిబంధనలు నవంబరు నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ప్రయాణికులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేసింది. అలాంటి వారికి క్వారంటైన్ అవసరం ఉండదని క్లారిటీ ఇచ్చింది. ప్రయాణికులు టీకా ధ్రువపత్రం, కొవిడ్‌ నెగెటివ్ ధ్రువపత్రాలు తీసుకురావాలని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన ఏ వ్యాక్సిన్ తీసుకున్నా అనుమతించనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.

కోవిడ్‌ విజృంభణ కారణంగా గతేడాది మార్చిలో కెనడా, మెక్సికోలతో ఉన్న సరిహద్దులను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. దీంతో ఆయా దేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది పర్యాట రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఈ సరిహద్దులు తెరుచుకోనుండటంతో పర్యాటకం మళ్లీ పుంజుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్