Sunday, February 23, 2025
HomeTrending NewsHurricane: అమెరికాలో హరీకేన్‌ హిల్లరీ...నెవాడాలో అత్యవసర పరిస్థితి

Hurricane: అమెరికాలో హరీకేన్‌ హిల్లరీ…నెవాడాలో అత్యవసర పరిస్థితి

హరీకేన్‌ హిల్లరీ తుపాను ప్రభావంతో అమెరికా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తుపాను ప్రభావంతో ఆ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులతో కూడిన వర్షం కారణంగా పలు రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. తుపాను కారణంగా దక్షిణ కాలిఫోర్నియాలోని చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. 84 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం తొలిసారని స్థానిక అధికారులు తెలిపారు. మంగళవారం పలు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

తుపాను బీభత్సం సృష్టిస్తూ భారీ వర్షాలు కురుస్తుండటంతో నెవాడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. అసాధారణమైన వేసవి తుపానుకు తోడు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్‌ సిటీకి ఈశాన్యాన ఆదివారం మధ్యాహ్నం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.1గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలో కూడా 3.1, 3.6 తీవ్రతతో భూమి రెండు సార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్