Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్Asia Cup Cricket: బంగ్లాకు ఎదురుదెబ్బ- లిట్టన్ దూరం

Asia Cup Cricket: బంగ్లాకు ఎదురుదెబ్బ- లిట్టన్ దూరం

ఆసియా కప్ క్రికెట్-2023 నేడు ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్ లో పాకిస్తాన్  జట్టు నేపాల్ తో తలపడనుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్…. గ్రూప్ ‘బి’ లో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

అయితే బంగ్లాదేశ్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ లిట్టన్ దాస్ ఈ టోర్నీకి దూరమయ్యాడు. కొద్దిరోజులుగా వైరల్ ఫివర్ తో బాధపడుతున్న లిట్టన్ పూర్తిగా కోలుకోలేదు, దీనితో మొత్తం సిరీస్ కు అతను ఆడే పరిస్థితి లేదు.  అతని స్థానంలో అనాముల్ హక్ బిజోయ్ ను జట్టులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్ ను శ్రీలంకతో పల్లెకేలె స్టేడియంలో రేపు గురువారం నాడు ఆడనుంది.

ఇండియా తన తొలి మ్యాచ్ ను పాకిస్తాన్  తో పల్లెకేలె స్టేడియంలో సెప్టెంబర్ 2న ఆడనుంది, ఇదే స్టేడియంలో 4 న నేపాల్ తో తలపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular