బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా. ఆస్కార్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అమీర్ ఖాన్ తో పాటు అక్కినేని నాగచైతన్య కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించారు. ఇది నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ. దీంతో టాలీవుడ్ లో కూడా లాల్ సింగ్ చ‌ద్దా పై క్రేజ్ ఏర్ప‌డింది.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక తప్పకుండా సినిమా కూడా భారీ స్థాయిలో సక్సెస్ అవ్వాలి అని చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ప్రమోషన్స్ కూడా గట్టిగానే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమీర్ ఖాన్ ప్రత్యేకంగా టాలీవుడ్ ప్రముఖుల కోసం లాల్ సింగ్ చద్దా స్పెషల్ షోను ప్రదర్శించడం విశేషం. రీసెంట్ గా హైదరాబాదుకు వచ్చిన అమీర్ ఖాన్ ప్రత్యేకంగా మెగాస్టార్ ను అలాగే నాగార్జునను కలుసుకొని లాల్ సింగ్ సినిమాను చూపించారు.

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నాగచైతన్య అలాగే ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కూడా స్పెషల్ షో లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి.. ఈ మూవీ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో.. నాగ‌చైత‌న్య‌కు ఎలాంటి పేరు తీసుకువ‌స్తుందో చూడాలి.

Also Read : గీతా ఆర్ట్స్ విడుదల చేస్తోన్న లాల్ సింగ్ చద్దా? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *