Thursday, March 19, 2026
Homeసినిమా‘అమితాబ్ బచ్చన్’ ఫస్ట్ లుక్

‘అమితాబ్ బచ్చన్’ ఫస్ట్ లుక్

Amitaab: తార శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సూర్య, రీతూ శ్రీ హీరోహీరోయిన్లుగా జె. మోహన్ కాంత్ దర్శకత్వంలో.. జె. చిన్నారి నిర్మించిన చిత్రం ‘అమితాబ్ బచ్చన్’. అక్కల శ్రీనివాస్ రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త సుదర్శన్ రెడ్డి, సతీష్ రెడ్డి, కందల శివకుమార్, మణి పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఫస్ట్ లుక్‌ని సతీష్ రెడ్డి విడుదల చేయగా.. ట్రైలర్‌ని సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు జె. మోహన్ కాంత్ మాట్లాడుతూ ‘‘ అమితాబచ్చన్.. ఈ పేరొక సంచలనం. ఈ పేరొక ప్రభంజనం. అయితే ఇది ఆయన బయోపిక్ మాత్రం కాదు. ఓ మంచి ప్రేమకథ. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమా చాలా బాగా వస్తుంది.  ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఎందుకంటే మంచి కథతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు”

“ఈ కార్యక్రమానికి వచ్చి మా టీమ్‌ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇటీవల బాలీవుడ్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి మా టీమ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ధైర్యంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకనిర్మాతలకు ప్రత్యేక అభినందనలు’’ అని తెలిపారు.

Also Read :  ‘ద కశ్మీర్ ఫైల్స్’ తెలుగులో డబ్ చేస్తాం : నిర్మాత అభిషేక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular