Sunday, May 19, 2024
HomeTrending Newsగ్యాస్, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనల సెగ

గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనల సెగ

 Protests : సామాన్యుడిపై అధిక భారం వేస్తూ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్ డీజిల్ మరియు నిత్యవసర ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు నిరసన చేపట్టాయి. పెరిగిన గ్యాస్, డీజిల్ ధరలపై మహిళలు తిరుగుబావుటా ఎగుర వేశారు.కేంద్రప్రభుత్వం విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నారీ లోకం పెద్ద ఎత్తున స్పందించింది.

టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి  నిరసన కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణ తహసిల్ చౌరస్తా వద్ద NH 63 రహదారి పై కట్టెల పొయ్యి వెలిగించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలోలైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్రశేఖర్ గౌడ్,మున్సిపల్ ఛైర్మెన్లు,ఎంపీపీ,జెడ్పీటిసి సభ్యులు,కౌన్సిలర్ లు, సర్పంచ్‌లు,యంపీటీసీలు, ఏఎంసి, పీఏసీఎస్,రైతు బందు సమితి,ఆత్మ చైర్మేన్లు,డైరెక్టర్ లు ,రైతు బందు గ్రామ కన్వీనర్లు,పార్టీ గ్రామ శాక అధ్యక్షులు,యూత్ నాయకులు,ముఖ్యనాయకులు,తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోడీ డౌన్ డౌన్ …కేంద్రప్రభుత్వ విధానాలు నశించాలి…పెరిగిన గ్యాస్,డీజిల్ ధరలు తగ్గించాలి అంటూ మహిళా లోకం చేస్తున్న నినాదాలతో సూర్యపేట పట్టణం మారుమ్రోగింది. సూర్యపేట జిల్లా కేంద్రంలోని స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి మొదలైన మహిళల నిరసన ప్రదర్శన శంకర్ విలాస్,యం జి రోడ్,తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ కు చేరుకుంది.భారీ ఎత్తున తరలి వచ్చిన నారీ లోకం ప్రధాని మోడీ పై తిరుగుబావుటాకు సిద్ధం అంటూ నినాదాలు చేయడంతో పాటు పెంచిన గ్యాస్,డీజిల్ ధరలకు నిరసనగా కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ  తెలంగాణ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ZP చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ KC నర్సింలు, DCCB వైస్ ఛైర్మన్ వెంకటయ్య, జిల్లా గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, కౌన్సిలర్లు, ZPTC లు, MPP లు, సర్పంచ్ లు, MPTC లు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

 Protests

పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ TRS పార్టీ  పిలుపు మేరకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం బేగంపేట లోని సివిల్ సప్లై కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత లు కట్టెల పొయ్యి పై వంట చేసి నిరసన తెలిపారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి, BJP హటావో…దేశ్ కి బచావో అంటూ TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, కిరణ్మయి, డివిజన్ అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీపతి, హన్మంతరావు, శ్రీహరి, నాయకులు శేఖర్, అబ్బాస్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేష్, ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, గుడిగే శ్రీనివాస్ యాదవ్, లక్ష్మి, విజయ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం హైదరాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి రమేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్డు మీద ఆందోళనలు చేసే పరిస్థితి వస్తుందనుకోలేదన్న ఎమ్మెల్సీ కవిత, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలందరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించేందుకు తెలంగాణ ఆడబిడ్డల పక్షాన ఢిల్లీలో కొట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను ఎంపీ కవిత డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో యువత ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. 2014 నుండి ఇప్పటి దాకా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల మీద ప్రజలకు సబ్సీడి ఇవ్వకుండా ప్రభుత్వం 23 లక్షల కోట్లు దోచుకుందన్నారు ఎమ్మెల్సీ కవిత. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులకు ఎగ్గొట్టిన రూ.11 లక్షల కోట్లను మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం, సామాన్యులకు మాత్రం ఏం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన సబ్సీడి డబ్బును, పెద్ద పెద్ద కంపెనీలకు దోచి పెడ్తోందన్న ఎమ్మెల్సీ కవిత, పేదలకు రుణమాఫీ చెయ్యకుండా బడా పారిశ్రామికవేత్తల రుణమాఫీ చేస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ మియాపూర్ చౌరస్తాలో తెరాస శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గాంధితో పాటు కార్పోరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి అవలంబిస్తున్న తీరుపై మహిళలతో కలిసి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మొన్నటికి మొన్న ఎలక్షన్ లు అయిన వెంటనే ధరలను పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తగ్గించని పక్షంలో తగు మూల్యం చెల్లించుకోక తప్పదని మహిళలు హెచ్చరించారు.

 Protests

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. పెరిగిన వంట‌ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read : దేశంలో పెట్రో,సిలిండర్ మంటలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్