Tuesday, June 9, 2026
Homeసినిమా'ప్రాజెక్ట్ కే' లో అమితాబ్ కు గాయాలు. నిజమా..? కాదా..?

‘ప్రాజెక్ట్ కే’ లో అమితాబ్ కు గాయాలు. నిజమా..? కాదా..?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే‘. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే… కీలక పాత్రలో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి గైడ్ లా శ్రీనివాసరావు వ్యవహరిస్తుండడం విశేషం. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

అయితే.. ఈ మూవీ షూటింగ్ లో అమితాబ్ కు గాయాలు అయ్యాయని వార్తలు వచ్చాయి. ఆయనకు షూటింగ్ లో గాయాలు కావడంతో హైదరాబాద్ లోని హాస్పటల్ లో చికిత్స చేయించుకుని ముంబాయి వెళ్లిపోయారట. కొన్ని వారాలు పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని అందుకని అమితాబ్ తన అన్ని కార్యక్రమాలను క్యాన్సిల్ చేసుకున్నారని తెలిసింది. అయితే… చిత్ర నిర్మాత అశ్వనీదత్ మాత్రం అలాంటిది ఏమీ లేదు.. అమితాబ్ కు గాయాలు ఏమీ కాలేదు. ఈ వార్తకు అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు అని మీడియా ప్రతినిధులకు చెప్పారు.

దీంతో అమితాబ్ కు గాయాలు అవ్వడం అనేది నిజమా..?  కాదా..? అసలు ఏం జరిగింది అనేది ఆసక్తిగా మారింది. వాస్తవం ఏంటంటే.. తనకు గాయాలు అయ్యాయని.. హైదరాబాద్ హాస్పటల్ లో చికిత్స్ తీసుకున్నానని.. ప్రస్తుతం ముంబాయిలో రెస్ట్ తీసుకుంటున్నాను అని అమితాబ్ తన బ్లాగ్ లో రాశారు. ఆ విధంగా ఈ వార్త బయటకు వచ్చింది. అయితే.. అశ్వనీదత్ మాత్రం ప్రమాదమే జరగలేదన్నట్టుగా ఎందుకు చెబుతున్నారో ఆయనకే తెలియాలి. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అని ప్రకటించడంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular