Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్అమిత్ కు రజతం

అమిత్ కు రజతం

నైరోబీ లో జరుతుగున్న ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ -20 ఛాంపియన్ షిప్ లో ఇండియా ఆటగాడు అమిత్ ఖాత్రి 10 వేల మీటర్ల రేస్ వాకింగ్ విభాగంలో రజ పతకం సాధించాడు. అమిత్ ఈ దూరాన్ని 42 నిమిషాల 17.94 సెకన్లలో చేరుకోగా కెన్యాకు చెందిన హెరిస్టన్ 42 నిమిషాల 10.84 సెకన్లలో చేరుకొని బంగారు పతకం సాధించాడు.  ఈ క్రీడా పోటీల్లో భారత్ కు ఇది రెండో పతకం. బుధవారం జరిగిన పోటీల్లో మన దేశ అథ్లెట్లు 400X4 రిలే పరుగు పందెంలో కాంస్య పతాకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (శాయ్) అమిత్ కు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది.

మరోవైపు ఈసారి జరిగిన పోటీల్లో ఇప్పటికే రెండు పతకాలు సాధించి  అథ్లెటిక్స్ అండర్ -20 ఛాంపియన్ షిప్ పోటీల్లో తొలిసారి ఒకటి కంటే ఎక్కువ పతకాలు తెచ్చుకొన్న రికార్డు కూడా సొంతం చేసుకుంది, గతంలో జరిగిన పోటీల్లో ఒకే పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  ఇంతకుముందు మన దేశానికి చెందిన సీమా- డిస్కస్ త్రో- కాంస్యం (2002); నవదీప్ కుమార్ – డిస్కస్ త్రో- కాంస్యం (2014); నీరజ్ చోప్రా – జావెలిన్ త్రో- స్వర్ణం (2016); హిమా దాస్ – 400 మీటర్ల పరుగు పందెం – స్వర్ణం (2018)లు పతకాలు సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్