Sunday, January 19, 2025
HomeTrending Newsఉపయోగం లేకపోతే...: కొడాలి కామెంట్స్

ఉపయోగం లేకపోతే…: కొడాలి కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ తో దేశ వ్యాప్తంగా ప్రచారం చేయించే ఆలోచన బిజెపికి ఉండొచ్చని మాజీ మంత్రి, కొడాలి నాని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగిన కొడాలి నిన్నటి అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై తనదైన శైలిలో  స్పందించారు. మోడీ, అమిత్ షాలు ఉపయోగం లేకుండా ఎవరితోనూ ఒక్క నిమిషం కూడా మాట్లాడరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో ఉపయోగం లేదనే ఢిల్లీలో ఆయన్ను కలిసేందుకు మోడీ, షా లు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు.

బిజెపిని తెలుగురాష్ట్రాల్లో విస్తరించేందుకు ఎన్టీఆర్ ను వినియోగించుకోవాలనే ఆలోచన వారికి ఉండొచ్చని, దీనిలో భాగంగానే ఆయనతో సమావేశం అయి ఉంటారని అన్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపిని అధికారంలోకి తీసుకు రావాలన్నదే మోడీ- అమిత్ షా ల లక్ష్యమని, దీనికోసం వారు ఎలాంటి రాజకీయ ఎత్తులైనా వేస్తారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ 25 సినిమాలకు పైగా నటించారని, ఇప్పుడు కొత్తగా ఆయన నటనను మెచ్చు కోడానికే పిలిచారన్న ప్రచారాన్ని తాను విశ్వసించలేనన్నారు.

Also Read : తెలుగు సినిమా తారక రత్నాన్ని కలిశా: అమిత్ షా ట్వీట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్