దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్‌డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన్న జిలింగ్ గోల్డ్ మైన్ సామర్థ్యం 580 టన్నులకు చేరింది. బంగారం ఉత్పత్తిలో ఇది చైనాలోనే అతిపెద్ద బంగారు గనిగా అవతరించనున్నట్టు కిలు మీడియా ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా మారనుందని తెలిపింది. ఈ గనిలో అదనంగా 200 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్టు జాతీయ సహజ వనరుల శాఖ ఇటీవల కనుగొన్నది. ఈ గని బంగారం ఉత్పత్తి సామర్థ్యం 580 టన్నులకు చేరడమే కాక, దేశ ఆర్థిక వ్యవస్థకు 200 బిలియన్ యువాన్‌లను సమకూర్చనుంది. తాము 550 టన్నుల బంగారం ఉన్న గనిని కనుగొన్నట్టు జిలిన్ గోల్డ్‌మైన్ యాజమాన్యం అయిన జిలిషాన్‌డాంగ్ గ్రూప్ కంపెనీ (ఎస్‌డీ-గోల్డ్) 2017లోనే ప్రకటించింది.
Post Views: 29