Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. రాధే శ్యామ్ పై చాలా ఆశ‌లు పెట్టుకుంటే.. అది డిజాస్ట‌ర్ అయ్యింది. అప్ప‌టి నుంచి ప్ర‌భాస్ అభిమానులు అప్ డేట్స్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.  ఎలాంటి అప్ డేట్ రాక‌పోవ‌డంతో డ‌ల్ అయ్యారు ఫ్యాన్స్. అయితే.. ఇప్పుడు తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నాడు ప్ర‌భాస్…. రెండ్రోజుల్లో స‌లార్ అప్  డేట్ రాబోతుంది.

ఇప్ప‌టికే ఆదిపురుష్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ‘ప్రాజెక్ట్ కే’ మూవీ దాదాపు 55 శాతం షూటింగ్ పూర్త‌య్యింద‌ని నిర్మాత అశ్వ‌నీద‌త్ ప్ర‌క‌టించారు. ఇది నిజంగా షాక్ అని చెప్ప‌చ్చు. ఎందుకంటే.. ఇంత త‌క్కువ టైమ్ లో అంత షూటింగ్ కంప్లీట్ అయ్యిందా..? అని ప్ర‌భాస్ ఫ్యాన్సే కాకుండా అంద‌రూ షాక్ అవుతున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. స‌లార్ అర‌వై శాతం షూటింగ్ పూర్త‌య్యింది. రెండు రోజుల్లో ఈ మూవీ నుంచి బిగ్ అప్ డేట్ రాబోతుంద‌ని స‌మాచారం. స‌లార్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తార‌ని కొంద‌రు అంటుంటే.. కాదు స‌లార్ టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. మొత్తానికి ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రాబోతుంది. ఈసారి ప్ర‌భాస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డులు సెట్ చేస్తాడేమో చూడాలి.

Also Read : స‌లార్ టీజ‌ర్ వ‌చ్చేది ఎప్పుడు..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్