Saturday, April 20, 2024
HomeTrending Newsగెజిటెడ్ అధికారుల ఫ్రీడమ్ వాక్

గెజిటెడ్ అధికారుల ఫ్రీడమ్ వాక్

భారత స్వతంత్ర వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని గన్ పార్క్ నుండి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వరకు ఫ్రీడమ్ వాక్ నిర్వహించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత నాయకత్వంలో నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లో సుమారు 1000 మంది TGO అధికారులు పాల్గొన్నారు.  అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఫ్రీడమ్ వాక్ ను ప్రారంభించారు. అనంతరం TGO లతో కలసి ఫ్రీడమ్ వాక్ లో బాగంగా గన్ పార్క్ నుండి నెక్లెస్ రోడ్ వరకు వాక్ చేశారు.

ఈ కార్యక్రమంలో TGO ముఖ్య నాయకులు సత్యనారాయణ, పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, సహదేవ్, రవీందర్ రావు, MB కృష్ణయాదవ్, గండూరి వెంకట్, చంద్రయ్య, B. వెంకటయ్య, డా. హరికృష్ణ, సుజాత, శ్రీలీల, లక్ష్మణ్ గౌడ్, pc వెంకటేష్, పూనమ్, జ్యోతి, లావణ్య తదితర సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Also Read : ఫ్రీడమ్ రన్…అభివృద్ధిలో తెలంగాణ పరుగు -శ్రీనివాస్ గౌడ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్