Thursday, June 18, 2026
Homeసినిమాఆనంద్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్

ఆనంద్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్

ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఆనంద్ నటించిన బేబీ, గంగం గణేశా అనే చిత్రాలు విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో బేబీ చిత్రానికి కలర్ ఫోటోతో నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేశ్ దర్శకుడు. ఎస్కేఎన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ తో బేబీ సినిమా మోస్ట్ ప్రామిసింగ్ అనిపించుకుంటోంది. ఈ వేసవిలోనే బేబీ చిత్రం విడుదల కాబోతోంది. ఇక ఆనంద్ నటించిన మరో వైవిధ్యమైన వినోదాత్మక చిత్రం గంగం గణేశా. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆనంద్ బర్త్ డే సందర్భంగా ఈ రెండు చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్స్ ను విడుదల చేశారు మేకర్స్.

బేబీ నుంచి విడుదల చేసిన పోస్టర్ లో తన ఫోటోను గోడకు అతికించి చాలా రోజులవుతున్నట్టుగా ఉన్న ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇది చాలా మందికి నోస్టాల్జిక్ ఫీలింగ్ ను ఇస్తుందని చెప్పొచ్చు. గంగం గణేశా నుంచి విడుదల చేసిన పోస్టర్ లో అతను ఓ పెద్ద గన్ పట్టుకుని ఉన్నాడు. దీనికి లోడెడ్ గన్ విత్ సాలిడ్ ఫన్ అనే క్యాప్షన్ జత చేస్తూ ఆనంద్ దేవరకొండకు బర్త్ డే విషెస్ చెప్పారు. వీటితో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను త్వరలోనే ప్రకటించబోతున్నాడు ఆనంద్ దేవరకొండ. తన బర్త్  డేను అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఆనంద్ దేవరకొండ మరిన్ని పెద్ద విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular