Sunday, January 19, 2025
Homeసినిమాఆనంద్ దేవరకొండ కొత్త మూవీ బేబీ

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ బేబీ

Anand Baby:  యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ‘. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ ఎలా ఉందో చూస్తే వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఈ పోస్టర్ తో ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్ మెంబర్స్. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ సినిమా విడుద‌ల ఎప్పుడు అనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్