Thursday, April 18, 2024
HomeTrending Newsమా పెద్దలతో పవన్ మాట్లాడతారు: సోము

మా పెద్దలతో పవన్ మాట్లాడతారు: సోము

Road Map: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి రోడ్ మ్యాప్ వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పవన్ తమ పార్టీ కేంద్ర నాయకులతో ఈ విషయమై మాట్లాడతారని వ్యాఖ్యానించారు. సాధారణంగా విలేకరుల ప్రశ్నలకు నేరుగా సమాదానాలిచ్చే వీర్రాజు ఈ విషయంమై మాత్రం ఓ నోట్ ను చదివి వినిపించారు.  విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఇతర నేతలతో కలిసి మీడియా సమావేశంలో సోము మాట్లాడారు.

“మా పార్టీ అగ్ర నాయకులు అమిత్ షా రెండు నెలల క్రితమే తిరుపతిలో మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారు, 2024 లోనే మేము అధికారంలోకి రావాలని జనసేనతో కలిసి ముందుకెళ్లే అంశంపై స్పష్టమైన సంకేతాలు మాకు అందాయి. ఆ దిశా నిర్దేశం ప్రకారమే మేము రాష్ట్ర వ్యాప్తంగా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటుంటూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నాము. రానున్న మరికొద్ది రోజుల్లోనే జనసేనతో కలిసి ఉద్యమాలను ఉదృతం చేసి అధికార పార్టీ కంటిపై కునుకు లేకుండా ప్రజల్లోకి వెళ్తాము… వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై క్షేత్ర స్థాయిలో పోరాటాలు నిర్వహిస్తున్నాము.  పవన్ కళ్యాణ్ మా మిత్ర పార్టీ అధ్యక్షులు, వారితో మా కేంద్ర పార్టీ ప్రతినిధులు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు, రానున్న రోజుల్లో బిజెపి-జనసేన మైత్రి మరింత బలపడుతుంది. 2024లో సంకీర్ణ ప్రభుత్వాన్ని మా ద్వయం ఖచ్చితం గా ఏర్పాటు చేసి తీరుతుంది” అంటూ  వివరించారు.

సిఎం జగన్ నవరత్నాలు ఇస్తుంటే తాము చాలా రత్నాలు ఇస్తున్నామని చెప్పారు. నెలకు రెండు సార్లు లబ్దిదారులకు బియ్యం అందిస్తుంటే ఒకసారి పూర్తిగా కేంద్రం ఉచితంగా ఇస్తోందని, మరోసారి ఇచ్చే దానిలో కేజీ 36రూపాయలు అయితే వాటిలో ౩౩ కేంద్రం, 2 రాష్ట్రం ఇస్తుంటే మరో రూపాయి లబ్ధి దారుడు ఇస్తున్నాడని వివరించారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్ళడానికే శక్తి కేంద్రాల ఇన్ ఛార్జ్ లను నియమించుకుంటున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి: వ్యతిరేక ఓటును చీలనివ్వను: పవన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్