Saturday, January 18, 2025
Homeసినిమా'డబుల్ ఇస్మార్ట్'లో మెరవనున్న అనన్య పాండే!

‘డబుల్ ఇస్మార్ట్’లో మెరవనున్న అనన్య పాండే!

పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకూ ఫ్లాపులతో సతమతమవుతున్న పూరికి ఈ సినిమా ఊరటనిచ్చింది. మాస్ ఇమేజ్ కోసం ఆరాట పడుతున్న రామ్ దాహం తీర్చింది. ఆ తరువాత పూరికిగానీ .. రామ్ కి గాని హిట్ పడలేదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లారు. ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ సెట్ చేయడంతోనే, అభిమానుల దృష్టిని ఈ ప్రాజెక్టు వైపుకు మళ్లించగలిగారు.

ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైనే ఉంది. తన మార్క్ మాస్ మసాలా సినిమాను అందించే పనిలోనే పూరి ఉన్నాడు. ఈ సినిమాలో కథానాయికలు ఎవరనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదుగానీ, తాజాగా అనన్య పాండే పేరు తెరపైకి వచ్చింది. అయితే హీరోయిన్ గా కాదు, ఒక స్పెషల్ సాంగ్ లో ఆమె మెరవనుందని అంటున్నారు. పూరి దర్శకత్వంలోని ‘లైగర్’ సినిమాతోనే అనన్య టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ కారణంగా ఆమెను ఇక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

అనన్యకి హిట్ ఇవ్వలేకపోయినా, ఆమెకి మరో ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పూరి ఆమెతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అనన్య అంగీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా సంజయ్ దత్ కనిపించనున్నాడు. ఆయన విలనిజం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ లో పాటలు ప్రధానమైన పాత్రను పోషించాయి. అందువలన ఆ సినిమాకి బాణీలను అందించిన మణిశంకర్, ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్