Sunday, June 14, 2026
Homeసినిమాపుష్ప సినిమాలో ‘దాక్షాయణి’ గా అనసూయ

పుష్ప సినిమాలో ‘దాక్షాయణి’ గా అనసూయ

Anasuya As Dakshayani  :

పుష్ప’ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్ డేట్ బయటికి వచ్చింది. దాక్షాయణిగా అనసూయ పాత్రను పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. ‘రంగస్థలం’ లో రంగమ్మత్త పాత్రతో అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్.. ఇప్పుడు దాక్షాయనిగా సరికొత్తగా చూపించబోతున్నారు. నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ ఇచ్చిన లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్.

‘అల వైకుఠ‌పురములో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్ప పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది.

Also Read :  ‘పుష్ప’ షూట్ లో ప్రవేశించిన రంగమ్మత్త

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular