Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్ తో శేఖ‌ర్ క‌మ్ముల‌ లీడ‌ర్ 2.నిజ‌మా.?

మ‌హేష్ తో శేఖ‌ర్ క‌మ్ముల‌ లీడ‌ర్ 2.నిజ‌మా.?

టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్ట‌ర్ అంటే ఠ‌క్కున గుర్తుకువ‌చ్చేది శేఖ‌ర్ క‌మ్ముల‌. ఆయ‌న సినిమాలు ఎంత సున్నితంగా ఉంటాయో తెలిసిందే. తను అనుకున్న కథని అంతే నిజాయితీగా ఎమోషన్స్ ని జోడించి తెరకెక్కించడంతో శేఖర్ కమ్ముల శైలి ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలంటే స్టార్స్ కూడా ప్రత్యేక ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే.. ఆయ‌న కూడా స్టార్స్ తో సినిమాలు చేయాల‌ని ట్రై చేశారు కానీ.. వ‌ర్క‌వుట్ కాలేదు.

ఫిదా సినిమా ఎంత‌టి విజ‌యం సాధించిందో తెలిసిందే. మెగా హీరో వ‌రుణ్ తేజ్ తో చేసిన ఫిదా మూవీని ముందుగా మ‌హేష్ బాబుకి చెప్పారు. ఆయ‌న‌కు క‌థ న‌చ్చింది. మ‌హేష్‌, శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్లో మూవీ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అనౌన్స్ మెంట్ రావ‌డ‌మే ఆల‌స్యం అనుకుంటున్న టైమ్ లో ఈ మూవీ లేద‌ని తెలిసింది. కార‌ణం ఏంటంటే.. ఇది హీరోయిన్ ప్రధానంగా సన్నితమైన భావోద్వేగాల సమారంగా సాగే క్యూట్ లవ్ స్టోరీ. దీని సోల్ ని చెడగొట్టడం ఇష్టం లేకే మహేష్ బాబు చేయనని చెప్పారట. అయితే.. త్వరలో మహేష్ బాబుతో శేఖర్ కమ్ముల సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మేట‌ర్ ఏంటంటే.. దగ్గుబాటి రానాని హీరోగా పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ గత కొన్నేళ్ల క్రితం లీడర్ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా విర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ తీయాల‌ని శేఖ‌ర్ క‌మ్ముల ప్లాన్ చేస్తున్నారు. మ‌హేష్ తో లీడ‌ర్ 2 అంటూ టాక్ వినిపించింది. ఇది నిజ‌మేనా అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. చ‌ర్చ‌లు జ‌రిగిన మాట వాస్త‌వ‌మే కానీ.. కొలిక్కి రాలేద‌ట‌. మ‌రి.. లీడ‌ర్ 2 ఎవ‌రితో సెట్ అవుతుందో చూడాలి.

 

Also Read: సాయిప‌ల్ల‌వి ఆకాశానికి ఎత్తేసిన వెంకీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్