Wednesday, May 8, 2024
Homeసినిమాసాయిప‌ల్ల‌వి ఆకాశానికి ఎత్తేసిన వెంకీ

సాయిప‌ల్ల‌వి ఆకాశానికి ఎత్తేసిన వెంకీ

Sai Pallavi Best: ద‌గ్గుబాటి రానా, ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం విరాట‌ప‌ర్వం. ఈ చిత్రానికి వేణు ఉడుగుల ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ మూవీ టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో విరాట‌ప‌ర్వం చిత్రంపై అంద‌రిలో ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుకకు విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ వేడుక‌లో వెంక‌టేష్ మాట్లాడుతూ “త‌న‌కు సినిమాలంటే ఎంతో గౌర‌వం, విరాట‌ప‌ర్వం లాంటి సినిమాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటున్నాను. అందుకే ఈ ఈవెంట్ కి వ‌చ్చాను’  అన్నారు. ఆ త‌ర్వాత విరాట‌ప‌ర్వం చిత్రంలోని ఓ డైలాగ్ చెప్పి వేదిక‌ను ఉర్రూత‌లూగించారు వెంకీ. లీడ‌ర్ సినిమా నుంచి రానా సిన్సియ‌ర్ గా విభిన్న‌మైన పాత్ర‌లు చేస్తున్నాడు అంటూ రానాపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

“హానెస్ట్ సినిమాల ప్ర‌స్తావ‌న వ‌స్తే.. విరాట‌ప‌ర్వం పేరు ఖ‌చ్చితంగా వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు అంత గొప్ప‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. రైటింగ్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తీది చ‌క్క‌గా కుదిరాయి. ఈ సినిమాలో ప్ర‌తి ఒక్క‌రు అవార్డ్ విన్నింగ్ ప‌ర్ ఫార్మెన్స్ తో అద‌రగొట్టేశారు. సాయిప‌ల్ల‌వి ఈ చిత్రంలో అద‌ర‌గొట్టేసింది. ఇది ఆమె కెరీర్లోనే ఉత్త‌మ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రానికి గాను సాయిప‌ల్ల‌వికి ఖ‌చ్చితంగా జాతీయ అవార్డ్ వ‌స్తుంది” అంటూ సాయిప‌ల్ల‌విని ఆకాశానికి ఎత్తేశారు వెంకీ. మ‌రి.. వెంకీ మాట నిజ‌మౌతుందేమో చూడాలి.

Also Read : విరాట‌ప‌ర్వం గ్రేట్ ల‌వ్ స్టోరీ : రానా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్