Monday, May 20, 2024
HomeTrending Newsతొలి రోజు 11 నామినేషన్లు

తొలి రోజు 11 నామినేషన్లు

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన బుధ‌వార‌మే 11 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. జూలై 23తో ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈలోగా కొత్త రాష్ట్రప‌తిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రప‌తి ఎన్నిక‌కు బుధ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఇలా నోటిఫికేష‌న్ విడుద‌లైందో, లేదో అలా రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. రాష్ట్రప‌తి ఎన్నిక‌లు పార్ల‌మెంటు స‌హా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ పోలింగ్ నిర్వ‌హిస్తున్నా… నామినేష‌న్ల దాఖలు మాత్రం ఢిల్లీలోని పార్ల‌మెంటులోని లోక్ స‌భ సెక్ర‌టేరియ‌ట్‌లోనే కొన‌సాగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది జూలై 2.

తొలి రోజే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు దాఖ‌లు కాగా…వాటిలో ఓ నామినేష‌న్‌ను రిట‌ర్నింగ్ అధికారి తిర‌స్క‌రించారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఒకరు లాలు ప్రసాద్ యాదవ్ అయితే RJD నేత లాలు మాత్రం కాదు. ఈ లాలు ప్రసాద్ యాదవ్ బీహార్ లోని శరన్ కు చెందినవారుగా తెలిసింది. మిగతా పది నామినేషన్లలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రకు చెందినవారు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక‌ల్లో పోటీ చేసేవారిని 50 మంది ఎంపిలు  ప్ర‌తిపాదిస్తేనే నామినేషన్లు చెల్లుబాటు అవుతాయి. పదకొండు నామినేషన్లలో ఎన్ని చెల్లుబాటు అవుతాయో చూడాలి.

Also Read : రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్