Sunday, June 7, 2026
Homeస్పోర్ట్స్ఐర్లాండ్ తో సిరీస్ కు హార్దిక్ సారధ్యం

ఐర్లాండ్ తో సిరీస్ కు హార్దిక్ సారధ్యం

Hardhik to lead: ఐర్లాండ్ తో, ఆ దేశంలో జరిగే రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ కు 17 మందితో కూడిన జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ జట్టుకు కప్ అందించిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించారు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతోన్న సిరీస్ కు సారధ్యం వహిస్తోన్న రిషభ్ పంత్ ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ మ్యాచ్ కు వెళుతుండడంతో  పాండ్యా ను ఎంపిక చేశారు. భువనేశ్వర్ కుమార్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. రాహుల్ త్రిపాఠి తొలిసారి జాతీయ జట్టుకు ఆడనున్నాడు.

జట్టు వివరాలు:  హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్, సూర్య కుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

సౌతాఫ్రికాతో ఆడుతోన్న టీమ్ లో నుంచి పంత్, శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సంజూ శామ్సన్, రాహూల్ త్రిపాఠి లను కొత్తగా చేర్చారు.

జూన్ 26, 28తేదీల్లో ఐర్లాండ్ లోని డబ్లిన్ లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.

Also Read :విశాఖ టి20లో ఇండియా విజయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular