Thursday, March 28, 2024
Homeసినిమాఅల్లు అర్జున్, అట్లీ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యిందా?

అల్లు అర్జున్, అట్లీ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యిందా?

Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో పుష్ప 2 పై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు పుష్ప 2 సెట్స్ పైకి వెళుతుందా..? ఎప్పుడెప్పుడు పుష్ప 2 థియేట‌ర్లోకి వ‌స్తుందా..? అని అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. దీని తర్వాతా బన్నీ ఏ సినిమా మొదలు పెడతానే అంశంపై ఆసక్తి పెరుతుతోంది.

టాలీవుడ్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, కోలీవుడ్ డైరెక్ట‌ర్ మురుగుదాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలీ భ‌న్సాలీ.. ఈ ముగ్గురులో ఎవ‌రో ఒక‌రితో బ‌న్నీ సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. తాజాగా బ‌న్నీ, అట్లీ మ‌ధ్య క‌థాచ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. దీంతో అల్లు అర్జున్, అట్లీ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో జ‌వాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ మూవీని ప్ర‌క‌టించారు.

వ‌చ్చే సంవ‌త్స‌రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆత‌ర్వాత అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త పై ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. అట్లీ చెప్పిన స్టోరీ లైన్ బాగుంద‌ని.. ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని చెప్పార‌ట బ‌న్నీ. అయితే.. అట్లీ చెప్పే ఫుల్ స్టోరీ విన్న త‌ర్వాత సినిమా చేయాలా..? వ‌ద్దా..? అనే నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : సంక్రాంతికి పుష్ప 2 రావ‌డం సాధ్య‌మేనా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్