9.2 C
New York
Monday, December 4, 2023

Buy now

Homeసినిమాసంక్రాంతికి పుష్ప 2 రావ‌డం సాధ్య‌మేనా..?

సంక్రాంతికి పుష్ప 2 రావ‌డం సాధ్య‌మేనా..?

Pongal-Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయ‌డంతో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఈపాటికే పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. అంచనాల‌కు త‌గ్గ‌ట్టుగా ఉండాల‌నే ఉద్దేశ్యంతో క‌థ పై సుకుమార్ ఇంకా క‌స‌రత్తు చేస్తూనే ఉన్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. వ‌చ్చే నెల‌లో సినిమా  సెట్స్ పైకి వెళ్ల‌నుంది. షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి కంటిన్యూగా షూటింగ్ జ‌రిపి ఆరునెలల్లోనే పూర్తి చేయాలి అనుకుంటున్నార‌ట‌. అంతే కాకుండా.. సంక్రాంతికి పుష్ప 2 చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇది సాధ్య‌మేనా అనే డౌట్ మొద‌లైంది. ఎందుకంటే.. సుకుమార్ షూటింగ్ కి ఎక్కువ టైమ్ తీసుకుంటారు. అలాగే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కి కూడా బాగా టైమ్ తీసుకుంటారు. అలాంటిది ఆరు నెల‌ల్లో షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా కంప్లీట్ అవుతుందా..?  ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా సంక్రాంతికి పుష్ప 2 వ‌స్తుందా..? అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read : పుష్ప 2 గురించి బ‌న్నీ వాసు ఏమ‌న్నారో తెలుసా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్