మోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయ్ – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనే భయంతోనే సోనియాగాంధి, రాహుల్ గాంధీ లకు ప్రధాని నరేంద్ర మోడీ నోటీసులు పంపారని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన పెట్రిల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడ్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మోడీ పాలనకు స్వస్తి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిరసిస్తూ ఈ రోజు హైదరాబాద్ ఈడి కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి ప్రతీకార రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

దేశ స్వాతంత్రం పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ కోసం స్థాపించిన పత్రిక నేషనల్ హెరాల్డ్ అని, అప్పుల్లో కూరుకుపోయిన పత్రికను తిరిగి నడపడానికి రాహుల్ నడంకట్టిండని రేవంత్ వెల్లడించారు. 90 కోట్ల రూపాయల అప్పుల్లో వున్న దాన్ని తిరిగి తెరిచారని, బిజెపి అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న పత్రిక అన్నారు. అందులో అక్రమాలు జరిగాయి అని తప్పుడు నోటీసులు ఇచ్చారని, సుబ్రమణ్య స్వామి ఈడీ కి ఫిర్యాదు చేసారు 2105లోనే ఇందులో ఏమి జరగలేదని రిపోర్ట్ వచ్చిందని, మళ్లీ దాన్ని రీ ఓపెన్ చేసి మోడీ సర్కార్ రాజకీయ కక్ష సాధింపునకు దిగిందన్నారు.

దేశంలో త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబమని, రాహుల్ కు 50 లక్షలు కాదు..5 వేల కోట్లు కావాలన్నా 24గంటల్లో కాంగ్రెస్ అభిమానులు ఇవ్వగలరని రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అక్కరలేదన్నారు. ఈ రోజు అన్ని రాష్ట్రాలలో ఈడీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతున్నామన్నారు. 1980లో కూడా ఇందిరా పై కేసు పెడితే.. తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలొకి వచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. జూన్ 23న సోనియా ఈడీ కార్యాలయంలో అడుగుపెడితే మోడీ పునాదులు కదుల్తాయని హెచ్చరించారు. గాంధీ కుటుంబం మీద ఈగ వాలిన రాజకీయంగా బతికి బట్టకట్టలేరన్నారు.

తెలంగాణ కల సాకారం చేసిన దేవత సోనియాగాంధీ అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి సోనియాను ఈడీ ఆఫీస్ కు పిలుస్తే ఉరుకుంటామా… సోనియా గాంధీ మీద చెయ్యి వేస్తే చెయ్యి నరికేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. గాంధీ వారసులం కాబట్టి శాంతి యుతంగా నిరసన తెలుపుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read :  తల తెగి పడ్డా వెనుకడుగు వేయను – రేవంత్ రెడ్డి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *