Saturday, April 20, 2024
Homeసినిమా‘పక్కా' గా ఆకట్టుకుంటున్న అందాల రాశీ

‘పక్కా’ గా ఆకట్టుకుంటున్న అందాల రాశీ

Andala Rasi:  యాక్ష‌న్ హీరో గోపీచంద్, యూత్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని అందాల రాశీ పాట విడుదలైంది. దీనికి మంచి అనూహ్య స్పందన వస్తుంది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌.
RELATED ARTICLES

Most Popular

న్యూస్