Tuesday, June 16, 2026
HomeసినిమాAndrea Jeremiah: 'సైంధవ్' నుంచి ఆండ్రియా లుక్ రిలీజ్

Andrea Jeremiah: ‘సైంధవ్’ నుంచి ఆండ్రియా లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో  కొంత మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇటీవలె రుహాని శర్మ పాత్రను డాక్టర్ రేణుగా పరిచయం చేశారు.

ఈ రోజు ఈ సినిమాలో మరో కీలక పాత్రను పరిచయం చేశారు మేకర్స్. బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో జాస్మిన్ పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో చేతిలో తుపాకీతో ఇంటెన్స్ లుక్ తో కనిపించింది ఆండ్రియా. పోస్టర్ లో స్పోర్ట్స్ బైక్‌ను కూడా గమనించవచ్చు. ప్రధాన తారాగణం పాల్గొంటున్న సైంధవ్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular