టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. అయితే వారిలో కృతి శెట్టి .. శ్రీలీల మాత్రమే నిలదొక్కుకున్నారు. గ్లామర్ పరంగా .. నటన పరంగా .. డాన్సుల పరంగా ఈ ఇద్దరూ మంచి పేరు తెచ్చుకున్నారు. వరుస అవకాశాలను చేజిక్కుంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ ఇద్దరి తరువాత స్థానంలో మరో హీరోయిన్ ఇంతవరకూ కుదురుకోకపోవడం ఆశ్చర్యం. ఆ ప్లేస్ లో ఎవరు సెట్ అవుతారా అనేది చాలామంది చర్చల్లో నడుస్తున్న ఆసక్తికరమైన అంశం.

శ్రీదేవి .. జయసుధ .. జయప్రద నుంచి ముగ్గురేసి హీరోయిన్స్ ఇండస్ట్రీని ఎలేస్తూ వచ్చారు. ఒక దశలో విజయశాంతి .. రాధ .. భానుప్రియ, మరో దశలో సౌందర్య .. రోజా .. రంభ .. సందడి చేస్తూ వచ్చారు. ఎంతమంది కథానాయికలు రేసులో ఉన్నప్పటికీ ముగ్గురు హీరోయిన్స్ ఆధిపత్యం కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా పూజ హెగ్డే .. రష్మిక మందన .. కీర్తి సురేశ్ టాప్ త్రీ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆ తరువాత వరుసలోనే కృతి శెట్టి .. శ్రీలీల ఎంట్రీ ఇచ్చారు .. తమదైన జోరు చూపుతున్నారు.

ఈ ఇద్దరి హీరోయిన్స్ కి తోడయ్యే మరో ముద్దుగుమ్మ ఎవరై ఉంటారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత స్థానంలో అనిఖ సురేంద్రన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ‘బుట్టబొమ్మ’ సినిమాతో ఈ అమ్మాయి తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. యాక్టింగ్ ఈ అమ్మాయికి కొట్టిన పిండి. ‘విశ్వాసం’ సినిమాలో ‘చిన్నారి తల్లి’ అనే పాట ఈ అమ్మాయిని తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువ చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక అవార్డులను అందుకున్న అనిఖ డేట్స్ దొరకడం ఇప్పుడు కష్టంగా మారింది. ‘బుట్టబొమ్మ’ రిలీజ్ తరువాత, టాలీవుడ్లో ముగ్గురు హీరోయిన్స్ ఆనవాయితీని తాను కొనసాగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *