Saturday, January 18, 2025
Homeసినిమాఅలా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి!

అలా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి!

అనిల్ రావిపూడి .. ఇంతవరకూ సక్సెస్ ను గురించి మాత్రమే విన్న దర్శకుడు. తాను ఎంచుకున్న కథలను జంధ్యాల – ఈవీవీ స్పూర్తితో ముందుకు తీసుకుని వెళ్లే దర్శకుడు. ఒక్కో హీరో బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను రెడీ చేసుకుంటూ, ఒక్కో హిట్ ను అందుకుంటూ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. తన కథల్లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయి. కాకపోతే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

అలాంటి అనిల్ రావిపూడి తన తాజా చిత్రాన్ని వెంకటేశ్ తో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ వెంకటేశ్ తో తాను చేసిన ‘ఎఫ్ 2’ .. ‘ఎఫ్ 3’ సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందనే సరికి అందరిలో ఆసక్తి మొదలైపోయింది. ఈ సినిమాకి ‘దిల్’ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఉన్నారు.

అందువల్లనే ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపుగా అదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కథ అంతా కూడా విలేజ్ నేపథ్యంలోనే నడుస్తుంది. సొంత ఊళ్లను .. స్నేహాన్నీ .. అనుబంధాలను కాపాడుకోవాలనేవి ఈ కథలో ప్రధానమైన అంశాలుగా కనిపించనున్నాయి. గతంలో అనిల్ రావిపూడితో చేసిన హీరోలలో బాలకృష్ణ మినహా మిగతా హీరోలు అతిథి పాత్రల్లో మెరిసే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్