Monday, April 15, 2024
HomeTrending Newsహూ కిల్డ్ కోడెల: బాబుకు అంబటి ప్రశ్న

హూ కిల్డ్ కోడెల: బాబుకు అంబటి ప్రశ్న

మేదరమెట్లలో ఈనెల 10న జరగనున్న సిద్ధం బహిరంగ సభ తరువాత రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ పారిపోవడం ఖాయమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి సభల్లో హూ కిల్డ్ బాబాయ్ అంటూ చంద్రబాబు చేస్తున్న కామెంట్లకు అంబటి ధీటుగా బదులిచ్చారు. హు కిల్డ్‌ కోడెల..హూ కిల్డ్‌ వంగవీటి మోహన రంగా? అని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడారు.

అంబటి మాట్లాడిన ముఖ్యాంశాలు:

 • నిన్న చంద్రబాబు పల్నాడులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన తీరు, శాసనసభ్యులు, జగన్‌ గారిపై ఆక్రోశాన్ని వెల్లగక్కారు.
 • తన 14 ఏళ్లు పరిపాలనలో పల్నాడుకు ఏం చేశాడో చెప్పే ప్రయత్నం మాత్రం ఆయన చేయలేదు.
 • చంద్రబాబూ..వరికపూడిశెలకు నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావు కదా..? నీ 14 ఏళ్లలో ఈ పథకం నీకు గుర్తుకు రాలేదా?
 • పల్నాడు డ్రాట్‌ మిటిగేషన్‌ స్కీం కూడా చంద్రబాబుకు ఇంతకు ముందు గుర్తుకు రాలేదు.
 • దీనికి తోడు చంద్రబాబు నరసరావుపేట పార్లమెంటులో ఉన్న 7 మంది శాసనసభ్యుల జాతకాలు రాస్తున్నాడట.
 • ఈయన చిత్రగుప్తుని చిట్టా రాస్తాడు..వాళ్ల అబ్బాయి ఎర్ర బుక్కు రాస్తాడట. ఈ పుస్తకాలు రాసి ఏం చేసుకుంటారయ్యా?
 • పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మారీచుడు అంటున్నాడు. మార్చమంటున్నాడు.
 • మార్చేది లేదు..నీకు దమ్ముంటే పిన్నెల్లిని ఓడించు. అతన్ని చూస్తేనే భయపడుతున్నావు.
 • కాసు మహేష్‌ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. వారి కుటుంబం ఈ రాష్ట్రంలో అనేకమైన పదవులు నిర్వహించి మేలు చేసిన వ్యక్తులు.
 • మీ పరిపాలనలో ఈ 7 నియోజకవర్గాల్లో ఓడిపోయిన మీ వాళ్ల గురించి చెప్పవేం..?
 • ఒక్క సారి మీరు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారో గుర్తు చేసుకోండి.
 • అందుకే ఆ 7 నియోజకవర్గాల్లో మీ టీడీపీ అభ్యర్థులను ప్రజలు ఓడించిన పల్నాడు చరిత్ర సృష్టించింది.
 • నా గురించి కూడా మాట్లాడాడు. ఆంబోతు రాంబాబు అంటున్నాడు.
 • నన్ను ఆంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా. నన్ను ఆంబోతు అంటున్నావ్‌..నిన్ను ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు.
 • ఏ ఆంబోతుకు ఏ ఆవును సప్లై చేశావో కూడా చిట్టా విప్పుతా..తస్మాత్‌ జాగ్రత్త.
 • నా గురించి మాట్లాడేటప్పుడు నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడు.
 • కోడెలను వేధించి..ఆయన మరణానికి కారణమైంది చంద్రబాబే
 • కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకోడానికి ఎవరు కారణం..?
 • ఆయన మరణానికి ప్రధాన కారణం నారా చంద్రబాబునాయుడు.
 • ఆయన ఓటమి పాలైన తర్వాత కనీసం నిన్ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు.
 • ఆయన్ను, ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టాలని నువ్వు నిర్ణయించుకున్నది వాస్తవం కాదా?
 • ఆయన్ను పలకరిద్దాం..అని పత్తిపాటి పుల్లారావు అడిగితే ఆ దుర్మార్గుడ్ని పలకరించవద్దు అన్నది చంద్రబాబే.
 • ఆ మాటకు ఆయన మరింత కుంగిపోయి మృతి చెందాడు.
 • శతృవులకు కూడా భయపడని కోడెల నీకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
 • శ్రీకృష్ణదేవరాయలు గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చాడట.
 • నువ్వొక తులసి మొక్క..నీ టీడీపీ తులసి వనం అంటే అశ్చర్యం వేస్తుంది
 • ఇక్కడి ఏడు నియోజకవర్గాలు ఓసీలకు ఇస్తే..పార్లమెంటు బీసీలకు ఇద్దామని జగన్‌మోహన్‌రెడ్డి గారు భావించారు.
 • బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆయన్ను గుంటూరులో పోటీ చేయమని చెప్తే కుదరదన్నాడు.
 • ఇక బీసీల ఓటు అడిగే హక్కు విశ్వాస ఘాతకుడైన శ్రీకృష్ణదేవరాయలకు లేదు.
 • లావు, కన్నాలంతా చాలా గొప్పవారట. ఒక్క సారి కన్నా చరిత్ర తిరగేస్తే చంద్రబాబును ఎలా తిట్టాడో తెలుస్తుంది.
 • మీకు అధికారం ఉంటే చాలు తప్ప నీకు ఏ సిగ్గూ శరం లేనే లేదు.
 • హూ కిల్డ్‌ బాబాయి కాదు..హు కిల్డ్‌ కోడెల..చెప్పు సమాధానం
 • హూ కిల్డ్‌ వంగవీటి రంగా..? రంగా మరణానికి నువ్వే కారణం.
 • ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలు, హత్యలకు నీ అధికార దాహమే కారణం.
 • రాజశేఖరరెడ్డి గారు వచ్చినప్పుడే నువ్వు మరుగున పడిపోయావ్‌. దురదృష్ట వశాత్తు ఓ ఐదేళ్లు పొరపాటున అధికారంలోకి వచ్చావు అంతే.
 • ఇక జగన్‌ గారు వచ్చిన తర్వాత నేరుగా రాజకీయాలు చేస్తున్నారు. నీలా మానిప్యులేటర్‌ కాదు.
 • ఆయన పరిపాలన ప్రారంభం అయిన తర్వాత తెలుగుదేశం భూస్థాపితం అయిపోయింది.
 • ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఫలితం లేదు.
 • రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు తాపత్రయపడుతున్నారో మా సిద్ధం సభలు చూస్తే అర్ధం అవుతుంది.
 • ఈ రాష్ట్రంలో తిరిగి మీరు అధికారంలో రావడం జరగని పని.
 • వైఎస్సార్సీపీ గూండాలను పల్నాడులో ఎలా కాపురాలు చేస్తారో చూస్తా అంటూ మాట్లాడుతున్నాడు.
 • నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు..నీకు, పవన్‌కు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు తప్ప..మీ టైం అయిపోయింది.
 • పల్నాడులో శాంతిభద్రతలు చంద్రబాబు కాలంలో కంటే చాలా బేషుగ్గా ఉన్నాయి.
 • ఎవరితోనైనా శాంతిభద్రతలపై చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
 • పల్నాడులో 7కి 7 అసెంబ్లీల్లో గెలుస్తాం..మెజార్టీలు కూడా పెంచి చూపిస్తాం.
 • అసలు లోకేశ్‌ కనిపించడం లేదేంటి? పాదయాత్ర చేశాడు..గొప్పోడు అన్నారు కదా?
 • ఇప్పుడెందుకు బయటకు తీసుకురావడం లేదు. వస్తే గోవిందా అనుకున్నారా?
 • మేనిఫెస్టోని 99శాతం పూర్తి చేసి ప్రజల్ని ఓట్లడుగుతున్న నాయకుడు ఈ దేశంలో ఒక్క జగన్‌ గారే.
 • చంద్రబాబు మేనిఫెస్టోని బుట్టదాఖలు చేసే వ్యక్తి. బాబు, పవన్‌ల కాలం చెల్లింది.
 • నాలుగో సిద్ధం సభ తర్వాత టీడీపీ పోటీ నుంచి పారిపోయే పరిస్థితి వస్తుంది
RELATED ARTICLES

Most Popular

న్యూస్