Thursday, March 28, 2024
Homeసినిమాపవర్ స్టార్ అనుకుంటే.. అనిల్ కపూర్ కన్ ఫార్మ్ అయ్యారా..?

పవర్ స్టార్ అనుకుంటే.. అనిల్ కపూర్ కన్ ఫార్మ్ అయ్యారా..?

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మించారు. ఇందులో చరణ్‌ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారు. డైరెక్టర్ శంకర్ ఓ వైపు చరణ్‌ మూవీ, మరో వైపు ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్ చేస్తుండడం వలన ఆలస్యం అయ్యింది కానీ.. లేకపోతే ఈపాటికే చరణ్‌ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేది.

అయితే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. ఈ పాత్రను పవన్ కళ్యాణ్ తో చేయించాలి అనుకున్నారని వార్తలు వచ్చాయి. పవన్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఈ మూవీలోని కీలక పాత్రను వేరే స్టార్ హీరోతో చేయించాలి అనుకుంటున్నారు. ఆ స్టార్ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ అని వార్తలు వస్తున్నాయి. ఇటీవల శంకర్ అనిల్ కపూర్ కి ఆ క్యారెక్టర్ గురించి చెప్పడం.. అనిల్ కపూర్ ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది.

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం చరణ్‌ అమెరికాలో ఉన్నారు. వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. అయితే.. నిజంగా ఈ మూవీలో అనిల్ కఫూర్ నటిస్తున్నారా..? లేక ఇది గ్యాసిప్పా అనేది తెలియాల్సివుంది. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్