Friday, September 20, 2024
HomeTrending NewsIT Notices to Babu: మీరు మాట్లాడరేం?: అనిల్ ప్రశ్న

IT Notices to Babu: మీరు మాట్లాడరేం?: అనిల్ ప్రశ్న

సిఎం జగన్ మీద, వైఎస్సార్సీపీ మీద అవాకులు, చవాకులు పేలుతూ, మాట్లాడితే ట్వీట్ లు పెట్టే దత్తపుత్రుడు చంద్రబాబుకు ఐటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.  ప్రతి విషయంలో  చంద్రబాబు తరఫున పేటెంట్ తీసుకుని మాట్లాడే పవన్ రూ.118కోట్ల ముడుపులకు సంబంధించిన ఇంత పెద్ద వ్యవహారంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని అడిగారు. పవన్ తో పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ నోటీసు ఇస్తే, కనీసం ట్వీట్ కూడా పెట్టట్లేదంటే ఆ  లావాదేవీల్లో ముడుపుల్లో అందాయని అనుకోవాల్సి వస్తుందన్నారు. వామపక్షాలు కూడా ఎందుకు నోరు మెదపట్లేదని, ప్రతీదానికి  తమపై నోరేసుకుని పడిపోయే సీపీఐ నారాయణ, రామకృష్ణ ఏమైపోయారని అనిల్ అడిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

పురందేశ్వరి తీరుపై కూడా అనిల్ అనుమానం వ్యక్తం చేశారు. ” బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలైన పురంధేశ్వరి ఈమధ్య కాలంలో రోజూ ప్రెస్ మీట్ లు పెట్టి అంత అప్పులు, ఇంత అప్పులు అని  ముఖమంత్రి జగన్ గారి గురించి మాట్లాడే మీరు…. ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? మీ మరిదిని కాపాడుకునే ప్రయత్నమా? కేంద్రంలోని మీ ప్రభుత్వ సంస్థ నోటీసులు అందిస్తే.. ఈరోజుకూ నోరు మెదపలేదంటే ఏంటి? బంధు ప్రీతా? మరిది ప్రీతా? దీనిపై కచ్ఛితంగా సమాధానం చెప్పాలి. మీకు బంధు ప్రీతే కావాలా? లేక ప్రజల పక్షాన నిలబడతారా అనేది తేల్చుకోవాలి?” అని వ్యాఖ్యానించారు.

ఐటీ జారీ చేసిన ఆ 46 పేజీల షోకాజ్ నోటీసుల్లో  లోకేష్ పేరు కూడా ఉందని,  తండ్రికొడుకులకు రూ.118కోట్లు ముడుపులు అందాయని స్పష్టంగా ఉందని, దుబాయ్ లో కూడా రూ.16 కోట్లు వీళ్లకు అందాయని అనిల్ ఆరోపించారు.

అమరావతి అనేది కేవలం బూటకం, ఒక బొమ్మ మాత్రమేనని, దాని వెనుక జరిగిందంతా లంచాలు, భూదందా, కమీషన్ల దందా మాత్రమేనని స్పష్టం చేశారు.  జగన్ ఢిల్లీకి వెళ్తే కేసులు కోసమని  చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు పదే పదే మాట్లాడతారని, ఇప్పుడు ఆ వంక, ఈ వంకతో చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని అనిల్ అడిగారు. “నడ్డా పక్కన కూర్చొని ఏంటీ ఆ గుసగుసలు.. ఎందుకంటే మీ బతుకులు బయటపడ్డాయి, మీ బండారం బయటపడింది, అమరావతి పనుల్లో మీరు తీసుకున్న ముడుపుల చిట్టా తీగ లాగితే ఈరోజు రూ.118కోట్లని తేలింది, ఇంకా డొంక కదిలితే మీ పరిస్థితి ఏంటనేది చంద్రబాబు అండ్ కో.. ఆందోళన” అని ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్