Monday, June 15, 2026
HomeTrending NewsBabu Tour: బళ్లారిలో బాబు- ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

Babu Tour: బళ్లారిలో బాబు- ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని, శక్తి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బళ్లారిలో NTR విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సమయంలో ఇలాంటి విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నందునే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, తెలుగు జాతి ఉన్నంత వరకూ ప్రజల గుండెల్లో ఆయన ఉంటారని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కర్నాటక యువజన సర్వీసులు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బి. నాగేంద్ర, బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, టిడిపి సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

“బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో నేటినుంచి  3 రోజుల పాటు పర్యటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular