Sunday, June 14, 2026
Homeసినిమా'యానిమల్' ఆ డేట్ కే వస్తుందా..?

‘యానిమల్’ ఆ డేట్ కే వస్తుందా..?

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా సక్సెస్ అవ్వడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కఫూర్ తో ‘యానిమల్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో రణ్ బీర్ కు జంటగా రష్మిక నటిస్తుంది. టీ సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

అయితే.. ఆగష్టు 11నే సన్ని డియోల్, అమీషా పటేల్ నటిస్తున్న గదర్ 2 రిలీజ్ కానుంది. అందుచేత ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడుతుంది కాబట్టి యానిమల్ చిత్రాన్ని వాయిదా వేయనున్నారని వార్తలు వస్తున్నాయి. యానిమల్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కి రెడీ అవుతుంది. తెలుగులో ఆగష్టు 11న చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ కానుంది. అందుచేత ప్రచారంలో ఉన్నట్టుగా యానిమల్ మూవీ వాయిదా పడుతుంది అనుకున్నారు కానీ.. ఇందులో వాస్తవం లేదని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular