Thursday, June 18, 2026
Homeసినిమా‘యానిమల్’ టీజర్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్

‘యానిమల్’ టీజర్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. ఇందులో రణ్‌ భీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్నారు. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి అప్ డేట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీ టీజర్ ను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ పర్ఫెక్ట్ గా వుంది.  ఇది పోస్టర్ మాత్రమే కాదు.. రణబీర్ కపూర్ పాత్ర, సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఇంటెన్స్ గా  వుంటుందో సూచిస్తోంది.

వెర్సటైల్ యాక్టర్ రణబీర్ కపూర్, విజనరీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో మూవీని ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. అనిల్ కపూర్, రష్మిక మందన, బాబీ డియోల్,  త్రిప్తి డిమ్రీ.. ఇలా భారీతారాగణంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుది. ప్రేక్షకులకు విజువల్, ఎమోషనల్ ట్రీట్ ని అందించనుంది. యానిమల్‌ను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్‌ల T-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular