Monday, February 24, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్ మూవీకి మరో మ్యూజిక్ డైరెక్టర్?

ఆర్ఆర్ఆర్ మూవీకి మరో మ్యూజిక్ డైరెక్టర్?

Anirudh Ravichander To Give Music For Promotional Song Of RRR Movie :

ఆర్ఆర్ఆర్.. సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఇటీవల రోర్ ఆఫ్ ఆర్‌.ఆర్‌.ఆర్‌ పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. రోర్ ఆఫ్‌ ఆర్‌.ఆర్‌.ఆర్ చూస్తుంటే.. సినిమా చూస్తున్న థ్రిల్ క‌లిగింది. స్వరవాణి కీర‌వాణి ఇచ్చిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అదిరింది. దీంతో ఈ మేకింగ్ వీడియో అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సంచలన చిత్రానికి మరో మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే.. సంగీతం కీరవాణి. అందులో ఎలాంటి సందేహం ఉండదు. మరి.. ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారేంటి అంటే.. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ సాంగ్ చేయాలి అనుకుంటున్నారట జక్కన్న. ఇందు కోసం ప్రత్యేకమైన సెట్‌ని కూడా నిర్మించారు. అయితే.. ఈ సాంగ్‌ను కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై జక్కన్న క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : పవన్ కోసం విజయేంద్రప్రసాద్ ‘పవర్’ ఫుల్ స్టోరీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్