Friday, March 29, 2024
Homeసినిమాద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజున పెళ్లి సంద‌D రెండ‌వ‌పాట‌

ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజున పెళ్లి సంద‌D రెండ‌వ‌పాట‌

శతాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు, క్లాస్‌ని, మాస్‌ని, ఫ్యామిలీస్‌ని, భ‌క్త‌జ‌న‌కోటిని అల‌రించిన ఎన్నో అపూర్వ చిత్రాల‌ని అందించిన ద‌ర్శ‌కేంద్రుడు కే. రాఘవేంద్ర రావు పుట్టిన‌రోజు మే 23. ఈ సందర్భంగా దర్శకేంద్రుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న‌`పెళ్లి సంద‌D` చిత్రంలోని రెండ‌వ‌పాట విడుద‌ల‌ కానుంది. ఏప్రిల్ 28న విడుద‌లైన `పెళ్లిసంద‌D` చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ `ప్రేమంటే ఏంటి..` శ్రోత‌ల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో దాదాపుగా 4 మిలియ‌న్ల ప్యూస్‌ సాధించి రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల కాంభినేష‌న్‌లో మ‌రో సూప‌ర్‌హిట్‌గా నిలిచింది.

ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ.. ‘రాఘ‌వేంద్ర‌రావు- కీర‌వాణి కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్ర‌తి పాట త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. డైరెక్ట‌ర్‌గా నాకు ఇదొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సినిమా చాలా బాగా వ‌స్తోంది’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాయిబాబా కోవెల‌మూడి మాట్లాడుతూ.. ‘ఏడు రోజులు ప్యాచ్‌వ‌ర్క్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ తీసేశాక బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి జూన్‌, జులైలో మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాం’ అన్నారు. రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు నటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్