Saturday, November 23, 2024
HomeTrending Newsకెనడా రక్షణ మంత్రిగా అనిత ఆనంద్

కెనడా రక్షణ మంత్రిగా అనిత ఆనంద్

భారత సంతతి మహిళ, కెనడా రాజకీయ నాయకురాలు అనిత ఆనంద్ ఆ దేశ రక్షణ మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. భారత సంతతికే చెందినా హర్జీత్ సజ్జన్ ఇప్పటివరకు రక్షణ శాఖ నిర్వహించగా ఆయన స్థానంలో అనిత ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. మిలిటరీలో లైంగిక వేధింపుల దర్యాప్తులో  సజ్జన్ సరిగా స్పందించలేదనే ఆరోపణలతో ఆయనను రక్షణ శాఖ నుంచి అంతర్జాతీయ అభివృద్ధి శాఖకు మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు.

కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దిగుమతుల నుంచి, టీకా పంపిణి వరకు అనిత ఆనంద్ కెనడా మంత్రిగా కనబరిచిన సేవా తత్పరతకు గుర్తింపుగా రక్షణ శాఖ దక్కిందని కెనడా మీడియా పేర్కొంది. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో 39 మంది మంత్రివర్గంలో అనిత ఆనంద్ కు కీలకమైన రక్షణశాఖ ఇవ్వటంపై భారతీయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

54 అనిత ఆనంద్ ఒక్ విల్లే నియోజకవర్గం నుంచి హౌస్ అఫ్ కామన్స్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో  కెనడా పార్లమెంటులో అడుగుపెట్టిన అనిత జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా పేరొందారు. నలుగురు పిల్లల తల్లి అయిన అనిత ఆనంద్ రాజకీయాల్లోకి రాక ముందు టొరంటో విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్ గా సేవలు అందించారు.

అనిత ఆనంద్ తల్లిదండ్రులు భారతీయులే. తల్లి పంజాబ్ కు చెందిన సరోజ్ దౌలత్ రాం కాగా తండ్రి తమిళనాడుకు చెందిన సుందర్ వివేక్ ఆనంద్. వీరికి ఇర్లాండ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇంగ్లాండ్ లో పెళ్లి చేసుకున్నారు. భారత్, నైజీరియాల్లో కొంత కాలం ఉన్న ఈ కుటుంబం 1965 లో కెనడాలో స్థిరపడింది. భారత్ లో ఉన్న బంధువులతో ఇప్పటికి వీరికి రాకపోకలు ఉన్నాయి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్