Sunday, January 19, 2025
Homeసినిమాబాల‌య్య‌, అనిల్ రావిపూడి మూవీలో ట్విస్ట్

బాల‌య్య‌, అనిల్ రావిపూడి మూవీలో ట్విస్ట్

Lady Villian: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఎఫ్ 3 స‌క్సెస్ సాధించింది. ప‌టాస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అనిల్ రావిపూడి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, స‌రిలేరు నీకెవ్వ‌రు, ఎఫ్ 3.. ఇలా వ‌రుస‌గా స‌క్సెస్ లు సాధించ‌డంతో బాల‌య్య‌తో చేయ‌నున్న మూవీ పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా జులై లేదా ఆగ‌ష్టు నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… ఈ సినిమాలో మరో తెలుగు హీరోయిన్ కీలక పాత్రలో నటించబోతుంది. ఆ హీరోయిన్ ఎవరంటారా… అంజలి. అయితే.. ఆమెది హీరోయిన్ పాత్ర కాదు అని, విలన్ పాత్ర అని టాక్ వినిపిస్తోంది.

హీరోయిన్ శ్రీలీల బాలయ్యకి కూతురిగా ఈ సినిమాలో నటిస్తోంది. కాగా ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని.. అది రవితేజనే అని గతంలో వార్తలు వచ్చాయి. రవితేజ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీరియస్ గా సాగుతూ.. ఇంటర్వెల్ కి సినిమా ఫుల్ కామెడీగా టర్న్ అవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. మ‌రి.. బాల‌య్య‌తో ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read : బాల‌య్య కోసం స్టైల్ మారుస్తున్న అనిల్ రావిపూడి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్