Saturday, April 20, 2024
HomeTrending Newsసమగ్ర సర్వేతో అందరికీ మేలు: సిఎం జగన్

సమగ్ర సర్వేతో అందరికీ మేలు: సిఎం జగన్

Survey Results: రాష్ట్రంలో వందేళ్ళ తరువాత జరుగుతోన్న సమగ్ర భూ సర్వే పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై తాడేపల్లి లోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సిఎం సమీక్షించారు. సమగ్ర సర్వే వివరాలను అధికారులు సిఎంకు వివరించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధానలక్ష్యాల్లో ఒకటని స్పష్టం చేశారు.  సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని, అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవాలని సిఎం ఆదేశించారు.  డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, అలాగే సర్వే రాళ్లు సమకూర్చుకోవడంలాంటి ప్రతి అంశంలోనూ వేగం ఉండాలని సూచన చేశారు.

సమగ్ర

ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయడు, అటవీ పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఇతర ఉన్నతాధికారులు.

Also Read : మరింతగా సేవ చేస్తా: జగన్ హామీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్