Saturday, January 18, 2025
Homeసినిమావేశ్య పాత్రలో మెప్పించిన అంజలి!

వేశ్య పాత్రలో మెప్పించిన అంజలి!

ఒకప్పుడు హీరోయిన్స్ ఎక్కువ కాలం పాటు తమ కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చారు. వాళ్ల సినిమాలు వరుసగా వస్తున్నా ప్రేక్షకులకు మొహం మొత్తలేదు. కానీ ఆ తరువాత కాలంలో సినిమా .. సినిమాకి కొత్త హీరోయిన్ ఉంటే బాగుంటుందనే ఆలోచన మేకర్స్ కి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కాజల్ .. తమన్నా .. శ్రియ వంటి కథానాయికలు చాలా కాలం పాటు తమ కెరియర్ ను నెట్టుకొచ్చారు. ఆ తరువాత వచ్చిన కథానాయికలకు ప్రతి సినిమా ఒక పరీక్షగా మారింది.

అలాంటి సమయంలోనే తెలుగు అమ్మాయిగా అంజలి ఇక్కడ అడుగుపెట్టింది. గలగల తెలుగు మాట్లాడే ఈ బ్యూటీని ప్రేక్షకులు ‘మన అంజలి’ అనుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.  అందువల్లనే ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను కలుపుకుని అంజలి 50 సినిమాలను చేసింది. ఇప్పుడున్న ట్రెండ్ లో ఇన్ని సినిమాలు పూర్తి చేయడమనేది అంత ఆషామాషి విషయం కాదు. అంతేకాదు మరో వైపున ఆమె వెబ్ సిరీస్ లతోను బిజీగా ఉంది.

గతంలో ఆమె చేసిన ‘ఝాన్సీ’ .. ‘ఫాల్’ వంటి వెబ్ సిరీస్ లకు విశేషమైన ఆదరణ లభించింది. అంజలీ ప్రధానమైన పాత్రగా ఎంతటి బలమైన కథనైనా .. పాత్రనైనా డిజైన్ చేయవచ్చనే ఒక నమ్మకం మేకర్స్ కి కలిగింది. అందువల్లనే ‘బహిష్కరణ’ వంటి ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 19 నుంచి  జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ కి అంజలి నటన ప్రధానమైన బలంగా నిలిచింది. వేశ్య పాత్రలో గ్లామర్ పరంగాను .. నటన పరంగాను అంజలి మెప్పించింది. ఆమె కెరియర్లో మరో మంచి వెబ్ సిరీస్ చేరిపోయిందనే చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్