Friday, March 29, 2024
HomeTrending Newsఅన్నార్థుల పాలిట అక్షయపాత్ర... అన్నపూర్ణ భోజన పథకం

అన్నార్థుల పాలిట అక్షయపాత్ర… అన్నపూర్ణ భోజన పథకం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకం నగరంలో నిరుపేద ప్రజల ఆకలి ని తీరుస్తుంది. మార్చి 1, 2014న 8 కేంద్రాలతో ప్రారంభమైన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించిన 150 కేంద్రాలకు పెంచేసింది. హైదరాబాద్ నగరానికి ఆయా పనులు, వివిధ వృత్తులు చేసుకునేందుకు నగరానికి వచ్చిన వారే కాకుండా విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్నపూర్ణ పథకం ఆసరగా నిలుస్తోంది.

ఆకలి తో ఎవ్వరూ ఉండకూడదనే మంచి ఉద్దేశ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసిన అన్నపూర్ణ పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 150 కేంద్రాల వరకు పెంచి ప్రతి కేంద్రం ద్వారా రోజుకు 300 భోజనాలు అందించాలని లక్ష్యంగా ఒక రోజుకు మొత్తం 45 వేల బోజనాలు అందించే ఏర్పాటు చేశారు.

2014 నుండి ఇప్పటివరకు నవంబర్ 2022 వరకు 198 కోట్ల 43 లక్షల రూపాయల ను ఖర్చుచేసి 10 కోట్ల 22 లక్షల 61 వేల 922 మందికి రూ.5 లకే భోజనం అందజేయడం జరిగింది. ప్రారంభ సంవత్సరంలో కేవలం 9 లక్షల 12 వేల 685 మందికి లబ్ధి చేకూర్చగా ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ పోతుంది. అయినా ఖర్చుకు వెనుకాడకుండా పేదలకు లబ్ధి కూర్చడం ధ్యేయంగా జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది.

2014-15 సంవత్సరం లో 9,12,685 మందికి పంపిణీ చేశారు.
2915-16 సంవత్సరం లో 27,12,046
2016-17 సంవత్సరం లో 38,49,620
2017-18 సంవత్సరం లో 95,59,676
2018-19 సంవత్సరం లో 1,03,06,590
2019-20 సంవత్సరం లో 89,63,665
2020-21 సంవత్సరం లో 2,29,46,080
2021-22 సంవత్సరం లో 3,66,87,830
2022-23 నవంబర్ వరకు 63,23,730 మంది లబ్ధి పొందారు.

కరోనా సమయంలో ఉచితంగా భోజనం అందించారు

కరోనా సమయంలో రవాణా సౌకర్యం లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రభుత్వం మానవీయ కోణం తో ఆలోచించి ఉచితంగా భోజన వసతి కల్పించడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయం తీసుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రభుత్వ ఖర్చుతో వారి సొంత గ్రామాలకు పంపించే ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి గ్రామానికి చేరుకునే వరకు కావాల్సిన పండ్లు, భోజనం, త్రాగు నీరు, సౌకర్యం కల్పించిన ఘనత ఈ రాష్ట్రానికే దక్కుతుంది.

ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి వ్యాప్తంగా శాశ్వతంగా ఉన్న కేంద్రాలతో కలిపి మొత్తం 373 కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా రాత్రి సమయంలో కూడా భోజనం అందించేందుకు 259 మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ పీరియడ్ లో మొత్తం 2 కోట్ల 29 లక్షల 46 వేల 80 మందికి ఉచితంగా డిన్నర్ అందించడం జరిగింది.
కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రత్యేక చర్యల వలన దేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది .

అన్నపూర్ణ కేంద్రాల్లో కూర్చొని తినడానికి ఏర్పాట్లు
అన్నపూర్ణ కేంద్రాల్లో ప్రజలు ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసేందుకు సీటింగ్ ఏర్పాటు కోసం ప్రయోగాత్మకంగా మొత్తం 8 ప్రదేశాలలో నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తెచ్చారు. సరూర్ నగర్ సర్కిల్ లో ఎన్ టి ఆర్ వెజిటేబుల్ మార్కెట్ కొత్తపేటలో కేంద్రంలో సీటింగ్ ఏర్పాటు చేశారు. కార్వాన్ సర్కిల్ లో టోలీచౌకి, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ కింద 2 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ సర్కిల్ లో సత్యం థియేటర్ వద్ద, చందా నగర్ సర్కిల్ అవాసా ఎదురుగా మాదాపూర్, మూసాపేట్ సర్కిల్ లో బాలానగర్ నర్సాపూర్ ఎక్స్ రోడ్డు, బాలానగర్ మెయిన్ రోడ్డు లో ఇందిరా నగర్, గాజులరామారం స్కూల్ లో సూరారం లోని మల్లారెడ్డి హాస్పిటల్ వద్ద గల కేంద్రాలకు సీటింగ్ సౌకర్యం కల్పించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా రూ. 5/- భోజన కేంద్రం
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి కుటుంబ సభ్యులకు టిఫిన్, భోజన వసతి కోసం వ్యయ ప్రయాసలు ఇబ్బంది కలగకుండా వారికి గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట మూడు పూటలు భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూ.5 లకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందిస్తారు. అందులో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలోని 18 ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులకు గాను 17 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ. 5లకే అందించేందుకు గత మే నెల 2వ తేదీన ప్రారంభించారు. ప్రతి రోజు మూడు పూట లకు సుమారు 8 వేల పైగా బోజనాలు అందించేందుకు టార్గెట్ పెట్టారు. హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా అందజేయడం జరిగింది.

అంతేకాకుండా నగరంలోని ప్రధాన ఆసుపత్రులు ఈ.ఎన్.టి, ఉస్మానియా, మహావీర్ ఆసుపత్రి, నిలోఫర్, కోటి మెటర్నిటీ, నిమ్స్, నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో మొత్తం 900 మందికి ప్రయోజనం చేకూర్చే విధంగా జిహెచ్ఎంసి ద్వారా రూ. 10.68 కోట్ల వ్యయంతో 7 నైట్ షెల్టర్లు నిర్మించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మే నెల నుండి నవంబర్ వరకు రూ. 212.50 కోట్ల ఖర్చు చేసి 8 లక్షల 09 వేల 530 భోజనాలు రూ. 5/- లకే అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్