Sunday, March 15, 2026
Homeసినిమా'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' టీజర్ విడుదల

‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ టీజర్ విడుదల

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన సినిమా ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. సినిమా జూలై 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర టీజర్ ను స్టార్ డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఓ పిట్టకథ సినిమా స్క్రీన్ ప్లే చూసినప్పటి నుంచి చెందు ముద్దు వర్కింగ్ స్టైల్ ఇంప్రెస్ చేసింది. అప్పటి నుంచి తను నాతో ట్రావెల్ అవుతున్నాడు. త్వరలో మా సంస్థలో సినిమా చేయబోతున్నాడు. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమాను కూడా చెందు 80, 90 బ్యాక్ డ్రాప్ లో నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా యూనిక్ గా తెరకెక్కించాడు. లావణ్య, చైతన్య ప్రామిసింగ్ గా నటించారు. ఇలా క్రియేటివిటివ్ గా, ప్యాషన్ గా రూపొందించే చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. టీజర్ చూస్తే ఇదొక క్వాలిటీ ఫిల్మ్ అనిపిస్తోంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ.. మా చిత్ర టీజర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. టీజర్ నుంచి మా “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. మా సినిమాలోని బ్యూటీ చూడబోతున్నారు. కోనసీమ, కేరళలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మా చిత్ర పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. టీజర్ ను హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular