Monday, June 15, 2026
Homeసినిమా‘మహావీరుడు’ సెకండ్ సింగిల్ విడుదల

‘మహావీరుడు’ సెకండ్ సింగిల్ విడుదల

హీరో శివకార్తికేయన్ ,”మండేలా” ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహావీరుడు’. శాంతి టాకీస్‌ పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ రెండవ సింగిల్ ‘బంగారుపేటలోన’ విడుదల చేసారు. బంగారుపేటలోన పాట  బ్యూటీఫుల్ కంపోజిషన్ తో ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతుంది. భరత్ ఈ పాటకు హై బీట్‌ లను అందించి అదితి శంకర్‌ తో కలిసి ఎనర్జిటిక్ గా ఆలపించాడు.

ఈ పాట వెంటనే ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ పాటలో శివకార్తికేయన్ ,అదితి బ్యూటిఫుల్  కెమిస్ట్రీని పంచుకున్నారు. రెహమాన్ రాసిన చక్కని సాహిత్యం మరో పెద్ద హైలైట్. ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌ గా, విధు అయ్యన్న  కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత వంటి ప్రముఖ తారాగణం వుంది. ఈ మూవీని అందరికీ నచ్చేలా ఉంటుందని.. శివ కార్తికేయన్ కెరీర్ లో మరో హిట్ సినిమా అవుతుందని టీమ్ నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular