Friday, March 13, 2026
HomeTrending Newsతెలంగాణలో కొత్త మద్యం షాపులు!

తెలంగాణలో కొత్త మద్యం షాపులు!

తెలంగాణ‌లో అక్టోబ‌ర్ నెల‌తో ఇప్పుడున్న 2,216 లిక్క‌ర్ షాపుల లైసెన్సులు ముగియ‌నున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన త‌రువాత మ‌ద్యం షాపుల వేలం ప్ర‌క్రియ ఉంటుంది. రాష్ట్రంలో సెప్టెంబ‌ర్ చివ‌రినాటికి కొత్త మ‌ద్యం పాల‌సీని అమ‌లులోకి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ స‌న్నాహాలు చేస్తున్న‌ది. ఇక ఈ వేలం లైసెన్స్ ఫీజులు పెంచాల‌ని ప్ర‌భుత్వం చూస్తున్న‌ది. దీని ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న 2,216 లిక్క‌ర్ షాపుల‌తో పాటుగా అద‌నంగా మ‌రో 200 లిక్క‌ర్ షాపుల‌ను కూడా ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం చూస్తున్న‌ది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత రాష్ట్రంలో కొత్త మ‌ద్యంషాపుల‌కు అనుతులు ఇవ్వ‌లేదు. కాగా, ఇప్పుడు 200 షాపుల‌కు అనుమ‌తులు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ది. ఇప్ప‌టికే రాష్ట్రంలో కొత్త‌గా 80 బార్లకు అనుమ‌తులు ఇచ్చినా వివిధ కార‌ణాల వ‌ల‌న అవి ప్రారంభం కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular